హైదరాబాద్(hyderabad) వాసులకు అలెర్ట్.. మరోసారి అద్భుతాన్ని కళ్లరా చూసేందుకు రెడీ అవ్వండి. మే9 న పొందిన ఆ థ్రిల్ మరోసారి మిమ్మల్ని పలకరించనుంది. రేపే (ఆగస్టు 3) జీరో షాడో డే. రేపు మధ్యాహ్నం 12:23 గంటలకు నీడ కనపడదు. ఈ ఏడాది మే9 న మధ్యాహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య ఈ అరుదైన ఘటన ఆవిష్కృతం అవ్వగా రేపు కూడా అదే దృశ్యం మరోసారి భాగ్యనగర వాసులకు కనువిందు చేయనుంది. ఇలాంటి అరుదైన ఘటనను కళ్లరా వీక్షించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. నగరవాసులు తప్పకుండా అనుభూతి చెందాల్సిందేనని అటు సైంటిస్టులు కూడా చెబుతున్నారు..!
పూర్తిగా చదవండి..హైదరాబాద్లో మరోసారి జీరో షాడో డే.. రేపు ఆ టైమ్లో నీడ కనపడదు బాసూ..!
భాగ్యనగర వాసులను మరోసారి 'జీరో షాడో డే' కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 12:23 గంటల నిమిషాలకు మరోసారి నీడ కనపడదు. ఈ ఏడాది మే9న కూడా ఇలానే జరిగింది. ఏడాదికి రెండు సార్లు ఇలా జరుగుతుంది. సూర్యుడు నేరుగా భూ మధ్యరేఖకు ఎగువన అలైన్మెంట్లో ఉంటాడు. అందుకే నీడ కనపడదు.

Translate this News:











