Doctor Radha Murder Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నంలో డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ కేసులో సంచలనమైన విషయాలను బయటపెట్టారు పోలీసులు. డాక్టర్ రాధ హత్య కేసులో భర్తే ఈ దారుణానికి తెగించాడు. మచిలీ పట్టణానికి చెందిన లోకనాథ మహేశ్వర్ రావు, రాధ దంపతులు.. జవ్వారుపేటలోని సొంత ఆస్పత్రిలో 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. గత నెల 25వ తేదీన రాత్రి రాధను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ భర్త మహేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. భర్తే హత్య చేయించినట్టు వెల్లడైంది. రాధ హత్యక పాల్పడిన డ్రైవర్, అటెండర్, భర్త మహేశ్వర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి వివాదాల కారణంగానే భార్యను హత మార్చినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Doctor Radha Murder Case: పక్కా ప్లాన్ తో భార్యను హత్య చేసిన డాక్టర్.. ఆస్తి వివాదాలే కారణం!
గత మూడు నెలలుగా భార్య రాధను చంపేందుకు మహేశ్వర్ రావు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే గత నెల 25న సాయంత్రం ఆస్పత్రి భవనం రెండో ఫ్లోర్ లో ఒంటరిగా ఉన్న రాధ దగ్గరకు లోక్ నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా.. భర్త రెంచ్ సహాయంతో తలపై దాడి చేశాడు. దీంతో డాక్టర్ రాధ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులకు ఆధారలు దొరక్కుండా.. అక్కడ కారం పొడి చల్లారు. ఆ తర్వాత ఏమాత్రం డౌట్ రాకుండా దొంగతనం జరిగినట్టు భార్య నగలు, డబ్బు ఎత్తుకెళ్లినట్టు చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేయగా.. భర్తపై అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బటయ పెట్టాడు. దీంతో డాక్టర్ మహేశ్వర్ రావును, డైవర్, అటెండర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Translate this News:











