మహారాష్ట్రలో విషాదం నెలకొంది. థానేలోని బాల్కుంబ్ ప్రాంతంలోని 40 అంతస్తుల భవనంలో ఆదివారం భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవనం లిఫ్ట్ కూలిపోవడంతో 6 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పై అంతస్తులో వాటర్ఫ్రూఫింగ్ పనులు పూర్తి చేసి, సర్వీస్ లిఫ్ట్ నుంచి కిందకు వస్తుండగా, ప్రమాదం జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. భవనంలోని లిఫ్ట్‌లో జరిగిన ప్రమాదం ఎత్తైన భవనాల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. లిఫ్ట్ తాడు తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Thane lift collapses: థానేలో భారీ ప్రమాదం..కుప్పకూలిన లిఫ్ట్…ఆరుగురు కార్మికులు మృతి…!!
థానేలో 40 అంతస్తుల భవనం లిఫ్ట్ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఇటీవల నిర్మించిన ఈ భవనంలో వాటర్ఫ్రూఫింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Translate this News:











