స్క్రీన్ ముందు ఎక్కువగా టైమ్ గడిపేవారికి అనేక సమస్యలు వస్తుంటాయి. అవి మానసిక సమ్యసలే కాదు శరీరక సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత బిజీ బిజీ బతుకుల్లో ఎక్కువ మంది కంప్యూటర్ల ముందు కూర్చొనే జాబ్సే చేస్తున్నారు. కంప్యూటర్లు లేకపోతే పని జరగని పరిస్థితి నెలకొంది. రోజుకు 8-10 గంటల పాటు కంప్యూటర్ల ముందు పని చేసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. జాబ్ చేయకపోతే లైఫ్ ముందుకు వెళ్లదు.. కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. అయితే ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు గడపడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వెన్ను. అందుకే వెన్నునొప్పి ఇప్పుడు అందరికి మోస్ట్ కామన్ సమస్యగా మారింది. ఇది కొన్నిసార్లు భరించలేని నొప్పిని కలిగిస్తుంది. అందుకే ఈ టిప్స్ పాటించండి.. కాస్త రిలీఫ్ రావొచ్చు.
పూర్తిగా చదవండి..Health Tips: వెన్నునొప్పి వేధిస్తోందా..? రిలీఫ్ కోసం ఈ చిట్కాలు పాటించండి!
స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడిపితే వెన్నునొప్పి వస్తుంది. నొప్పి తగ్గడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. పెయిన్ రిలీఫ్ క్రీమ్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే ఏదైనా మందులను ఉపయోగించే ముందు డాక్టర్ను సంప్రదించాలి. వీలైతే మీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ప్రతీ 30 నిమిషాలకు ఒక స్మాల్ గ్యాప్ తీసుకోండి.

Translate this News:











