ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు. ఓ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటేనే పోలీసులు స్పీకర్ అనుమతి తీసుకుంటారన్న ఆయన.. అలాంటిది 15 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. కానీ పోలీసులు అవేమీ చేయలేదని ఆయన.. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. నోటీసులు ఇచ్చిన అనంతరం చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేసిందని కేంద్ర మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు.

Translate this News:











