Kishan Reddy Fires On BRS: సీఎం కేసీఆర్(CM KCR)పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బోయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం భూమిని కేటాయించారన్న ఆయన.. ప్రభుత్వ భూమిని ప్రతిపక్ష పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కోకాపేట్ (Kokapet)లో 11 ఎకరాల భూమిని కేటాయించుకున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మకైందని ఎంపీ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్.. కొత్త అప్పులు పుట్టకపోవడంతో ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని విమర్శించారు. నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి అసైన్డ్ భూములను లాక్కొని అమ్మేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపదను సృష్టించాలన్నారు. కానీ కేసీఆర్ రాష్ట్రంలో సంపదను సృష్టించక పోగా.. ఉన్న సంపదను కొల్లగొడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: ప్రతిపక్ష పార్టీకి భూమి ఎలా కేటాయిస్తారు
సీఎం కేసీఆర్పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్తో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు అమ్మారని ప్రశ్నించారు. కోకాపేట భూములను తన బినామీలకు అమ్ముతున్నాకరని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











