What to Know About Pathological Liars: చిన్నపిల్లలే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని ఎవరైనా అంటే వారికి బయట ప్రపంచంతో పెద్దగా సంబంధంలేనట్టే భావించవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇతరులకు హాని చేయాలనో.. ఉద్దేశపూర్వకంగానో అబద్ధాలు చెప్పరు.. కానీ కొంతమంది పెద్దవాళ్లు మాత్రం తమ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేలా అబద్ధాలు ఆడతారు. అలాంటివారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం ప్రమాదంలో పడినట్టే లెక్క. అయితే కొన్ని స్ట్రాటజీలు ఉపయోగించి వారి అబద్ధాలను ధీటుగా ఎదుర్కొవచ్చు.
➼ అబద్ధాలకోరుతో వ్యవహరించడం చాలా ఛాలెంజింగ్ విషయం.. కానీ ఇక్కడ పరిగణించవలసిన కొన్ని వ్యూహాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
Telling Lies: పదేపదే అబద్ధాలు చెప్పేవారిని ఎలా డీల్ చేయాలి? ఈ టిప్స్ పాటించండి..!
నిజాయితీ లేని వ్యక్తిగా ప్రపంచం మిమ్మల్ని గుర్తించేలాగా చేసుకోవద్దు. అబద్ధాలు అందరూ చెబుతారు.. అయితే అవి ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. అబద్ధాలు తరుచుగా చెప్పే వ్యక్తితో లిమిట్లో ఉండండి. కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. పదేపదే అబద్ధాలు చెప్పే వ్యక్తిని "పాథలాజికల్ అబద్ధాలకోరు(pathological liar)" అని పిలుస్తారు.

Translate this News:











