Holidays for schools in september: ఎగ్జామ్ డేట్స్ అంటే భయం.. హాలీడేస్ డేట్స్ అంటే ఇష్టం.. ‘స్కూల్‌కి సెలవు’ అనే మాట వినిపిస్తే ఫస్ట్ బెంచర్ నుంచి లాస్ట్ బెంచర్ వరకు ప్రతి ఒక్కరిలోనూ తెలియని ఆనందం వికసిస్తుంది. తెలియకుండానే పిల్లల పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. సెలవు, హాలీడే, బంద్ అనే పదాలకు ఉండే మహిమ అలాంటిది. ఇది అనుభవించినవాడికే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ స్కూల్ డేస్‌లో ఈ హాలీడేస్ కోసం ఎంతగానో వెయిట్ చేసి ఉంటారు. స్కూల్ జూన్‌లో స్టార్ట్ అవుతుంది.. ఆ నెల, జులైలో పెద్దగా హాలీడేస్ ఉండవు.. ఆగస్టు, సెప్టెంబర్ నుంచి సెలవులు మొదలువుతాయి. ఏ నెలలో ఏ రోజు హాలీడే ఉందా అని.. స్కూల్ క్యాలెండర్‌తో పాటు ఇంట్లోని క్యాలెండర్‌ని కూడా తిరగెస్తుంటారు.
పూర్తిగా చదవండి..School holidays: పిల్లలకు సెప్టెంబర్‌లో పండుగే పండుగా.. ఎన్ని రోజులు సెలవులంటే?
ఈ సెప్టెంబర్‌లో విద్యార్థులకు మొత్తం ఏడు రోజులు సెలవులు వచ్చాయి. నాలుగు ఆదివారాలతో పాటు సెప్టెంబర్ 6న జన్మాష్టమి, సెప్టెంబర్ 18న వినాయక చతుర్థి, సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్-నబీ / ఈద్-ఎ-మిలాద్ వచ్చాయి. మరోవైపు ఢిల్లీలో పిల్లలకు మరో మూడు రోజుల సెలవులు అదనం.. జీ20 సమావేశాల కారణంగా సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో దేశరాజధానిలో స్కూల్స్‌కి హాలీడే ప్రకటించారు..

Translate this News:











