ఇది ఖమ్మం జిల్లా.. దొరల జిల్లా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇది ఖమ్మం జిల్లా అని, ప్రజల జిల్లా అని భట్టి స్పష్టం చేశారు. దొరల జిల్లా కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వచ్చిన హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆయన.. ఇది హరీష్ రావు జారిగి కాదని, కేసీఆర్ జాగిరి అంతకంటే కాదని భట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాశనం చేశారన్నారు. ప్రజల పోరాటానికి ఇంతవరకు న్యాయం జరగలేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన ప్రతీ సారి 90 సీట్లు మావేనని చెప్పుకుంటున్నారన్న ఆయన.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయే తెలంగాణ ప్రజలే తేల్చుతారని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Bhatti Vikramarka: ఇది ప్రజల జిల్లా దొరల జిల్లా కాదు.. భట్టి కీలక వ్యాఖ్యలు
ఇది ఖమ్మం జిల్లా.. దొరల జిల్లా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇది ఖమ్మం జిల్లా అని, ప్రజల జిల్లా అని భట్టి స్పష్టం చేశారు. దొరల జిల్లా కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











