Data Scientist Jobs: మార్కెట్లో ఏది బెస్ట్ జాబ్ అంటే చెప్పడం కష్టమే. ఎవరి అభిప్రాయం వాళ్లు చెబుతారు. మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఒకరి అభిప్రాయానికి మరొకరి అభిప్రాయానికి తేడా ఉంటుంది. ఇక హై శాలరీ జాబ్స్ విషయంలో కూడా టాలెంట్‌ని బట్టి జీతం ఉంటుంది. అయితే కొన్ని జాబ్స్‌కి మాత్రం ఫ్రెషర్స్ స్టేజీ నుంచే ఎక్కువ జీతం వస్తుంది. అందులో డేటా సైంటిస్ట్ జాబ్ ఒకటి. ప్రతి పరిశ్రమలో దీని అప్లికేషన్ కారణంగా ఈ జాబ్‌కి డిమాండ్ ఎక్కువ ఉంది. డేటాను విశ్లేషించి, ఫలితాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల డేటా శాస్త్రవేత్తలకు జీతాలు భారీగా ఇస్తున్నారు.
పూర్తిగా చదవండి..High Salary Job: ఏడాదికి రూ.70లక్షల శాలరీ సంపాదించుకునే జాబ్ ఇది.. ఈ కోర్సు నేర్చుకుంటే లైఫ్ సెట్!
డేటా సైంటిస్ట్‌కి ఉన్న డిమాండ్ దేశంలో మరే ఇతర జాబ్స్‌కి లేదు. డేటా సైంటిస్ట్ ఏడాదికి సగటును రూ.13లక్షలు సంపాదిస్తున్నాడు. మనం డెవలెప్ అయ్యే కొద్దీ ఏడాదికి రూ.70లక్షల వరకు సంపాదించుకోవచ్చు. జేఈఈ(JEE) మెయిన్, జేఈఈ(JEE) అడ్వాన్స్డ్, గేట్ లాంటి వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ఆధారంగా అన్ని డేటా సైన్స్ కళాశాలలకు అడ్మిషన్లు జరుగుతాయి. ఇక సగటు డేటా సైన్స్ కోర్సు ఫీజు రూ.70,000 - రూ.4,50,000 మధ్య ఉంటుంది.

Translate this News:











