స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఉండవల్లి రిట్ పిటిషన్ దాఖలు చేసారు. 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలుకేసును సిఐడి నుంచి సీబీఐ విచారణకు ఇవ్వాలని ఉండవల్లి పిటిషన్ లో కోరారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ED,చంద్ర బాబు,అచ్చెన్నాయుడు లను ప్రతివాదులుగా చేర్చారు. దీని మీద ఈరోజు జస్టీస్ ధీరజ్ సింగ్ టాకుర్ ధర్మాసనం విచారణ జరపనున్నారు.
పూర్తిగా చదవండి..Undavalli writ petition:నేడు ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ మీద విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐతో విచారించాలని ఆయన కోరారు. ఈ కేసు ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.

Translate this News:











