Rules Ranjan Movie Trailer: ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్'(rules ranjan). కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), నేహా శెట్టి(Neha Shetty) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ట్రయిలర్ కూడా వచ్చింది.
పూర్తిగా చదవండి..Rules Ranjan Trailer : నవ్వించిన రూల్స్ రంజన్
'రూల్స్ రంజన్' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ "ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?" అని అడగగా.. హీరో కిరణ్ అబ్బవరం "బీర్ ఓకే" అని చెప్పే సంభాషణతో ట్రైలర్ సరదాగా ప్రారంభమైంది.

Translate this News:













