Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండకు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో మిగిలిన భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే దివ్య దర్శనానికి 6 గంటలు.. స్పెషల్ దర్శన్ టికెట్ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం సమయం తీసుకుంటుంది. ఇక శుక్రవారం 68,021 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ.3.63 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక 31,047 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండకు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో మిగిలిన భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.

Translate this News:











