హిమాచల్ ప్రదేశలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సోమవారం 52 మంది మరణించగా, 56 మంది గల్లంతయ్యారు. సోలన్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడ 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సిమ్లాలో శివాలయం కూలిపోయిన ఘటనలో ఆరుగురు మరణించారు. భారీ వర్షాలకు పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. శిథిలాల కింది నుంచి పలువురిని రెస్య్కూటీం కాపాడింది. క్షతగాత్రులను ఐజీఎంసీలో చేర్చినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిమ్లా సునీల్ నేగి తెలిపారు.
పూర్తిగా చదవండి..Himachal Rains:హిమాచల్లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు, పెరుగుతోన్న మృతుల సంఖ్య..!!
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సోలన్ సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 52 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. సిమ్లాలో శివాలయ కూలి ఆరుగురు మరణించారు. మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

Translate this News:











