Hyderabad Traffic Alert: హైదరాబాద్(Hyderabad)లో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ జామ్(traffic jam) అవుతుంటుంది. ఇక వర్షం పడిందంటే మరింత దారుణంగా పరిస్థితి ఉంటుంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతాయి. గంటల కొద్దీ ఎక్కడ ఉండాల్సిన వాళ్లు అక్కడే ఉండిపోయి ఉంటారు. ఈ తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుండగా.. నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇక రానున్న కొన్ని గంటల పాటు అత్యవసరమైతే తప్ప లోపలే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రజలను కోరారు.
వర్షం కారణంగా మియాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపీఎస్ రసూల్ పురా, తార్నాక, సంగీత్ జంక్షన్లను సందర్శించారు. హైదరాబాద్ లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ-డీఆర్ ఎఫ్ సాయం కోసం 040-21111111 లేదా 9000113667 చేయాలని జీహెచ్ఎంసీ (GHMC) సూచించింది.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు!
హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వరుణుడు దంచికొట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మియాపూర్, మదాపూర్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయి.

Translate this News:











