ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫీవర్ సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏ నలుగురిని పలకరించినా ఏదో ఒక ఆరోగ్య సమస్య చెబుతున్నారు. డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లాంటి సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజానికి బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ ఏ సమస్య ఉందో అర్థంకాదు. అయితే జ్వరం వచ్చిన వెంటనే ముందుగా అందరికి గుర్తొచ్చే ట్యాబ్లెట్ పారాసిటమాల్ మాత్రమే. టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి చాలామంది పారాసిటమాల్నే వాడుతారు. అప్పటికీ ఫీవర్ కంట్రోల్ అవ్వకపోతే ఆస్పత్రికి వెళ్తారు. అయితే ఇలా పదేపదే పారాసిటమాల్ని యూజ్ చేయడం ఏ మాత్రం మంచిది కాదు. చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.
పూర్తిగా చదవండి..Paracetamol: ప్రతి చిన్న విషయానికి పారాసిటమాల్ వాడుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పక తెలుసుకోండి!
పారాసిటమాల్ని అధిక మోతాదులో తీసుకోవడం అసలు మంచిది కాదు. మీకు అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ చెప్పిన విధంగానే ఏ మందునైనా వాడాల్సి ఉంటుంది. పారాసిటమాల్ అధిక మోతాదు కడుపు నొప్పి, వికారం, వాంతులతో పాటు కొన్నిసార్లు ఏకంగా కోమాకు దారితీస్తుంది.

Translate this News:











