Harsha Bhogle Shares Pic Of His First Pay Cheque: హర్షా భోగ్లే క్రికెటర్ కాదు.. అయినా ఆయనకు క్రికెట్‌పై ఉన్న నాలెడ్జ్ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోదు. చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ బాట పడతారు. కానీ హర్షా మాత్రం ప్రొఫెషనల్ కామెంటేటర్.. చాలా న్యూట్రల్‌గా కామెంటరీ చేస్తారు హర్షా. అటు సెటైరికల్‌గా కూడా పంచ్‌లు వేయడంలో హర్షా దిట్ట. ఇక ఆయన క్రికెట్ నంబర్స్ గురించి మాట్లాడేటప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. ఆయన బ్రెయిన్లోనే క్రికెట్ స్టాట్స్ పాతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న యూనిక్ స్పెషాలిటీ అది. క్రికెట్ గాడ్ సచిన్ స్ట్రైట్ డ్రైవ్‌ని హర్షా కంటే బెటర్‌గా ఎవరూ వర్ణించరు. అంతటి క్లాసిక్ కామెంటేటర్ హర్షా. ఆయన కామెంటరీ మొదలు పెట్టి ఇవాళ్టి(సెప్టెంబర్ 12)తో 40ఏళ్లు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షా చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Harsha Bhogle: హర్షా భోగ్లే మొదటి పే చెక్ ఫొటో వైరల్.. మీరు తోపు సర్..!
వ్యాఖ్యాతగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న హర్షా భోగ్లేకు క్రికెట్ లవర్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా దురదర్శన్‌లో ప్రసారమైన మొదటి వన్డే మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పే స్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు హర్షా. ఆ పే చెక్‌లో హర్షా జీతం రూ.350 అని ఉంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు క్రికెట్‌కు వాయిస్‌గా మారాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

Translate this News:











