Harish Rao comments on Congress party Declaration: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌కు విలువ లేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అమలు చేయలేని హామీలు ఎన్ని ప్రకటిస్తే ఎం లాభం ఉంటుందన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొల్లాపూర్ నియోజకవర్గ నేత అభిలాష్ రావు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరారు. ఆయన్న హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకర్షించడానికి అనేక హామీలు ఇస్తుందన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్న మంత్రి.. ఎన్నికల తర్వాత ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Harish Rao: కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌కు విలువ లేదు
కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇటీవల కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ నేతల హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Translate this News:











