ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish rao) అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ ను ఆయన సందర్శించి మాట్లాడారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది బిఆర్ఎస్ సర్కార్ మాత్రమేనన్నారు. సమైక్య పాలనలో చెరువుల్లో బతుకమ్మలు వేద్దామనుకుంటే నీళ్లు ఉండేవి కాదన్నారు.
పూర్తిగా చదవండి..Dussehra: ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..!
తెలంగాణ వ్యాప్తంగా నిండు కుండల్లా చెరువులు, కుంటలు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించింది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.

Translate this News:











