Hamas Senior Died in Israel Hamas War: మొన్నొక ముఖ్య కమాండర్, ఈరోజు సీనియర్ మెంబర్…ఇలా ఇద్దరు ముఖ్యమైన వారు ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో మృతి చెందారు. ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ మురద్ అబు మురద్ (Murad Abu Murad) చనిపోయాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది. వారం కిత్రం ఇజ్రాయెల్‌లో హమాస్ చేసిన దాడులకు మురద్ నేతృత్వం వహించాడు. ఇప్పుడు మురద్ చనిపోవడం హమాస్ గ్రూప్ కు పెద్ద దెబ్బే. ఇద్దరు ముఖ్య వ్యక్తులు చనిపోవడంతో మిలిటెంట్లు డిఫెన్సులో పడిపోయారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఎండ్ స్టేజ్‌కు వచ్చినట్లే అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ దేశస్థులు దొరికే వరకు ఇజ్రాయెల్ తమ పోరాటాన్ని ఆపేదిలేదని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం…మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా?
తమ వైమానికి దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. మురద్ అబు మురద్ అనే సీనియర్ మిలిటెంట్ మెంబర్ మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న హమాస్ దాడులకు మురద్ ముందుండి నడిపించాడని ఇజ్రాయెల్ ఫోర్సెస్ చెబుతున్నాయి.

Translate this News:











