16 రోజులుగా ఇజ్రయెల్-హమాస్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ముందు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అప్పుడు 222 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్ళారు. గాజాలో ఎక్కడో వారిని దాచిపెట్టారు.అప్పటి నుంచి గాజా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తమ వారిని రక్షించుకునేందుకు ఎన్ని రోజులు అయినా పోరాడుతామని చెబుతోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం. మరోవైపు హమాస్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకపక్క వేలల్లో పాలస్తీనియన్లు చనిపోతున్నా తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడం లేదు. దాడులు ఆపితే బందీలను విడిచిపెడతామని హమాస్ చెబుతుంటే…ముందు బందీలను రిలీజ్ చేయండి…దాడులు ఆపుతామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.
పూర్తిగా చదవండి..Hamas:మరో ఇద్దరు బందీలను విడిచిపెట్టిన హమాస్
హమాస్ మిలిటెంట్లు మరో ఇద్దరు బందీలను విడుదల చేసారు.ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృక్పథంతో ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించంది. మిలిటెంట్ల చేతిలో మొత్తం 222 మంది బందీలుగా ఉన్నారు.

Translate this News:











