హమాస్ అన్నిరకాలుగా యుద్ధానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రూఫ్ లు కూడా మా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గో. తమ సైన్యం దాడి చేసినప్పుడు ఒక హమాసం మిలిటెంట్ చనిపోయాడని అతని దగ్గర రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు. సాయుధుడి మృతదేహం దగ్గర సైనైడ్ డిస్పర్షన్ డివైజ్ ఎలా వాడాలో వివరించే యూఎస్బీ దొరికిందన్నారు. దీన్ని వాళ్ళు ఉగ్రసంస్థ అల్ ఖైదా నుంచి పొందినట్లు ఐజాక్ ఆరోపించారు. మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్ సభ్యుల దగ్గర దొరికాయన్నారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్ సెంటర్ల లక్ష్యంగా వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
పూర్తిగా చదవండి..Israel:హమాస్ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి-ఇజ్రాయెల్ అధ్యక్షుడు
ఇజ్రాయెల్ మీద రసాయన ఆయుధాల దాడులకు హమాస్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు.

Translate this News:











