మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో దూకి గురుకులంలో జూనియర్ లెక్చరర్ తిరుమలేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్టు వాయిస్ రికార్డ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. గురుకులంలో సిబ్బంది వేధింపులు భరించలేకే తిరుమలేశ్వరి చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. మృతురాలు తిరుమలేశ్వరి(35) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే తన చావుకు ప్రిన్సిపల్, తోటి ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణమని వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. తిరుమలేశ్వరి స్వగ్రామం మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామం.. ఆమెకు భర్త సంపత్, కూతురు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై చెన్నూరు గురుకుల పాఠశాలకు వచ్చింది. భర్త సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్‌స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటున్న 1275 మంది క్రీడాకారులు, మరో సహాయ సిబ్బందికి సంబంధించి భోజన ఏర్పాట్ల బాధ్యతలను తిరుమలేశ్వరికి అప్పగించారు.
పూర్తిగా చదవండి..Manchirial Crime: చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న గురుకుల టీచర్.. వాయిస్ రికార్డులో వారి పేర్లు?
ఈ మధ్య గురుకులంలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన మరువకముందే.. మరొక ఘటన వెలుగులోకి వస్తోంది. విధి నిర్వహణలో సమస్యలు వస్తే అండగా నిలవాల్సిన తోటి టిచర్లు రాక్షసుల మారుతున్నారు. ఓ మహిళా ప్రిన్సిపల్ తోడు ఉండకపోగా.. పనిగట్టుకొని సమస్యలు సృష్టించారు. ఆపై ఆమెను సూటిపోటి మాటలతో బాధించి చివరకు ప్రాణం తీసేలా చేశారు. సహచరుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ టీచర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Translate this News:











