Gudivada Amarnath: విశాఖలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటించారు. ఈ నెల 16 న ప్రముఖ ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సెంటర్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇన్ఫోసిస్ సీఈవో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలోని ఇన్ఫోసిస్ సెంటర్ ను సందర్శించారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఇన్ఫోసిస్ ప్రతినిధులు, జిల్లా అధికారుల చొరవతో విశాఖలో ఇన్ఫోసిస్ సిద్ధమైందని తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ రాక ఏపీలో ఐటి అభివృద్ధికి కీలకం కానుందని ప్కేరొన్నారు. దాదాపు1000 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ను స్టార్ చేయనున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పూర్తిగా చదవండి..విశాఖలో ఇన్ఫోసిస్..ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారంటే..!!
విశాఖలో ఇన్ఫోసిస్ ను సందర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇన్ఫోసిస్ ప్రతినిధులు, జిల్లా అధికారుల చొరవతో విశాఖలో ఇన్ఫోసిస్ సిద్ధమైందని తెలిపారు. ఈ నెల 16 న సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇన్ఫోసిస్ సీఈవో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు1000 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ను స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు.

Translate this News:











