Group 2 Aspirant Pravalika Suicide: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బృందావన్ హాస్టల్లో ఉంటున్న ప్రవల్లిక.. తన గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. హాస్టల్లో ఉంటూ ప్రవల్లిక (Pravalika) పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు హాస్టల్‌కు చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడ భారీగా చేరుకున్న విద్యార్ధులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ట్రాఫిక్ కూడా జామ్ అయింది.
పూర్తిగా చదవండి..Pravalika: నిరుద్యోగ యువతి ఆత్మహత్య..పోటీ పరీక్షల వాయిదానే కారణమా?
హైదరాబాద్.. అశోక్‌నగర్‌లో విషాదం జరిగింది. 25 ఏళ్ల ప్రవల్లిక.. అర్థరాత్రి బృందావన్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసిన ఆమె, అది రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఆమె తల్లిదండ్రులకు రాసినట్లుగా ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు సేకరించారు.

Translate this News:












