Telangana Governor Tamilisai Comments: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గవర్నర్. తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని, తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉంటారని అన్నారు. రాళ్లు విసిరితే, వాటితో ఇల్లు కట్టుకుంటా.. దాడిచేసి రక్తం చిందిస్తే, దానినే సిరాగా మలుచుకుని తన చరిత్ర లిఖిస్తానని అన్నారు. గవర్నర్గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని అన్నారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని నేను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గవర్నర్. తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని, తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉంటారని అన్నారు.

Translate this News:











