హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మీర్‌పేటలో ముగ్గురు కామాంధులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో బాలిక ఇంటికి వెళ్లిన యువకులు.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించారు. బాధితురాలి సొదరుడు ఎటు వెళ్లకుండా మెడపై కత్తిపెట్టి తన ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడి వెళ్లే సరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు.

Translate this News:











