తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గొట్టిపాటి రవికుమార్ నివాళులర్పించారు. గ్రామ మహిళలు హారతులు ఇచ్చిన తర్వాత సైకిల్ యాత్ర ప్రారంభమైంది. గొర్రెపాడు ఎస్సీ కాలనీ నుంచి ఎస్ఎల్ గుడిపాడు, రామాంజనేయుపురం, బుసవారి పాలెం, ముక్తేశ్వరం, సూరేపల్లి గ్రామాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగింది. గొట్టిపాటి సైకిల్ యాత్రకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పలు గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పూర్తిగా చదవండి..AP Politics: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి సైకిల్ ర్యాలీ
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర14వ రోజు బల్లికూరవ మండలంలో సాగింది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలోని గొర్రెపాడు గ్రామం నుంచి మండలంలోని సురేపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది.

Translate this News:











