Reopening of Amrit Udyan : రాష్ట్రపతి భవన్ ఆత్మగా వర్ణించబడే 15 ఎకరాల తోట మొగల్ గార్డెన్. దీనిని అమృత ఉద్యాన్ అని ఇటీవలే పేరు మార్చారు. మొగల్ గార్డెన్స్ అంటే పర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్‌కు ఇలాంటి తోటలు అంటే చాలా ఇష్టం. భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎన్నో మొగల్ గార్డెన్స్ ఉన్నాయి. వాటన్నింటిలోకెల్లా రాష్ట్రపతి భవన్ ఉన్న మొగల్ గార్డెన్ చాలా ప్రసిద్ధి చెందినది. 1913లో క్యాన్స్ టెన్స్ స్టార్ట్ రాసిన గార్డెన్ ఆఫ్ ది గ్రేట్ మొగల్స్ గ్రంథంలో ఒక గార్డెన్ ను ప్రభుత్వ భవనంగా మార్చాక దాని స్టైల్ ఎలా ఉంటుందో వివరించారు. అదే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.
పూర్తిగా చదవండి..Amrit Udyan: పర్యాటకులకు శుభవార్త.. ఢిల్లీలో అమృత ఉద్యాన్ చూసొద్దాం రండి
అమృత్ ఉద్యాన్ అంటే మొఘల్ గార్డెన్. ఇప్పుడు సందర్శకుల కోసం మరోసారి తెరిచారు. ఇంతకుముందు మార్చి నెలలో మాత్రమే సందర్శకులకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సీజన్లో సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఇప్పుడు మనం ఇక్కడ వసంత రంగులను చూడవచ్చు. పర్యాటకుల కోసం ఇది ఆగస్టు 16 నుండి 2023 సెప్టెంబర్ 17 వరకు సందర్శనకు అనుమతి ఇస్తున్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో అమృత్ ఉద్యాన్‌ను రాష్ట్రపతి భవన్ పరిషత్‌లో నిర్మించారు. వాస్తవానికి, ఇది ఈస్ట్ లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్లను కలిగి ఉంది. కానీ ఇప్పుడు అది మరింత సంపన్నమైంది.

Translate this News:











