Gold Loan – Bullet Repayment Scheme : పట్టణ సహకార బ్యాంకుల కోసం బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీమ్ కింద బంగారంపై (Gold Loan) రుణాన్ని ఆర్బీఐ రెండింతలు చేసి రూ.4 లక్షలకు పెంచింది. ‘బుల్లెట్’ రీపేమెంట్ స్కీమ్ (Bullet’ Repayment Scheme) కింద, రుణగ్రహీత రుణ పదవీకాలం ముగిసే సమయానికి అసలు మొత్తం, వడ్డీని ఒకేసారి చెల్లిస్తారు. బంగారంపై రుణంపై వడ్డీని ప్రతి నెలా లెక్కించినప్పటికీ, అసలు మొత్తం, వడ్డీని ఒకేసారి చెల్లించాలి. అందుకే దీన్ని ‘బుల్లెట్’ రీపేమెంట్ అంటారు. ఏది ఏమైనప్పటికీ, ప్రాథమిక రంగానికి రుణాలివ్వడం కింద అన్ని లక్ష్యాలను చేరుకున్న పట్టణ సహకార బ్యాంకులకు మార్చి 31, 2023 వరకు ఈ పరిమితి పొడిగించింది.
పూర్తిగా చదవండి..Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త..ఆర్బీఐ కీలక నిర్ణయం..ఏంటంటే..?
బంగారంపై లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీం కింద బంగారంపై రుణాన్ని ఆర్బీఐ రెండింతులు చేసి రూ. 4లక్షలు పెంచింది. రుణగ్రహీత ఏడాది చివరిలో మొత్తం అసలు, వడ్డీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, రుణ పరిమితి గడువు ముగుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే,,రుణగ్రహీత రుణాన్ని చెల్లించిన మరుసటి రోజే మళ్లీ లోన్ తీసుకోవచ్చు.

Translate this News:











