హైదరాబాద్ నగరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం నగరంలోని గోల్కొండ కోట వద్ద సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తర్వాత అక్కడ జరిగే పోలీసుల కవాతులో పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో పోలీసులు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఇందులో భాగంగా రాణి మహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు వెళ్లే రోడ్డును మూసివేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పలు రూట్లకు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు అధికారులు వివరించారు.
పూర్తిగా చదవండి..Independence Day celebrations: స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట..
హైదరాబాద్ నగరం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గోల్గొండ కోటలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు.

Translate this News:











