Yanam’s Pulasa Fish Record: రుచిలో మేటిగా భావించే పులసంటే ఉభయ గోదావరి జిల్లాల వాసులకే కాదు.. ఇతర ప్రాంతాల వారికీ ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారి అయినా పులస చేప తినాలని మాంసాహార ప్రియులు కోరుకుంటారు. రెండు కిలోల పులస చేప కేంద్రపాలిత ప్రాంతమైన యానం వశిష్ట గోదావరిలో మత్స్యకారులకు చిక్కింది. కేవలం 2కిలోల పులస చేప రికార్డ్ ధర పలికింది. నాగలక్ష్మి అనే మత్యకార మహిళ రూ.19 వేలకు వేలం పాటలో దక్కించుకుంది. రాజకీయ నాయకుడి కోసం రూ.26 వేలకు ఓ వ్యక్తి కొనుగోలు చేశాడని మత్స్యకారు మహిళ తెలిపింది. ఇటీవల కాలంలో పులస చేపలు చాలా అరుదుగా దొరకడంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది.
పూర్తిగా చదవండి..Yanam’s Pulasa Fish Record : 2కిలోల పులసకు వేలంపాట..ఎంతపలికిందో తెలుసా..?
చేపల పులుసు అంటే నచ్చని వారు ఉండరు. పులస కూర ఎప్పుడెప్పుడు రుచిచూడాలా అని మాంసాహార ప్రియులు ఎదురుచూస్తుంటారు.ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరడం ఖాయం.కేంద్ర పాలిత ప్రాంతమైన యానం వశిష్ట గోదావరిలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది.రెండు కిలోల బరువుండే ఈ పులస చేప రూ.19వేల ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.

Translate this News:











