Gas Cylinder Blast: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్ పేలింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిలిండర్ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్టోర్ రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. రూంలోని బ్లీచింగ్ పౌడర్ పొగలు అలుముకున్నాయి. పొగలు బయటకు వెళ్లేందుకు కిటికీ అద్దాలను ధ్యంసం చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Gas Cylinder Blast: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన గ్యాస్ సిలిండర్
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్ పేలింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిలిండర్ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Translate this News:











