గణేశ్ నిమజ్జనం సందర్భంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. చిన్నప్పుడు వినాయకుడు అంటేనే గుర్తుకు వచ్చేది పిండి వంటలైతే.. పెద్దయిన తర్వాత వినాయకుడు అంటేనే ప్రకృతి గుర్తుకు వస్తుందన్నారు. తన చిన్నతనంలో వినాయక చవితికి ఒక రోజు ముందుగానే వెళ్లి 21 రకాల పత్రాలను తీసుకుని వచ్చే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పండుగ వచ్చిందంటే మొదట్లో పులిహోర, పాయసం అన్నీ తినేస్తామన్నారు. కానీ ఓ వయస్సు వచ్చిన తర్వాత ఆరోగ్య రిత్యా వాటిని వదిలేసే పరిస్థితి వచ్చిందన్నారు. తనకు అన్ని రకాల వంటకాలు ఇష్టమేనన్నారు. ఈ సృష్టికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులని బ్రహ్మానందం అన్నారు. మనకు జన్మనిచ్చిన వారిని నిరంతరం స్మరించుకోవడమే భక్తి అని అన్నారు.
పూర్తిగా చదవండి..RTV Bramhanandam Interview: వినాయకచవితి అంటే గుర్తుకు వచ్చేది ఇదే.. రంగమార్తాండాతో ఆ కోరిక తీరింది!
చిన్నప్పుడు వినాయకుడు అంటేనే గుర్తుకు వచ్చేది పిండి వంటలైతే.. పెద్దయిన తర్వాత వినాయకుడు అంటేనే ప్రకృతి గుర్తుకు వస్తుందన్నారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. సీరియస్ క్యారెక్టర్లు చేయాలన్న తన కోరికను రంగమార్తాండా సినిమా తీర్చిందన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.

Translate this News:











