జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం సమావేశాలు ముగిసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శనివారం జీ20 సభ్య దేశాలతో పాటు 8 ఆహ్వానిత దేశాలకు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రులు, 6 అంతర్జాతీయ సంస్థలకు చెందిన సభ్యుల భేటీతో సాంస్కృతిక శాఖ జీ20 సమావేశాలు పూర్తవుతాయని ఎంపీ తెలిపారు. జీ20 సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాలు చక్కటి వేదికగా నిలుస్తున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: ఆధ్మాత్మిక నగరంలో జీ20 సమావేశాలు
జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Translate this News:











