సీఎం జగన్ నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసిన అవినీతి గుర్తుకు రాలేదా? అని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. ఈ రోజు రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ.. మచ్చలేని చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. తెలుగు వారు వారి గళాన్ని వినిపిస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడం కోసం కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందని గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..AP Politics: చంద్రబాబు మన భారత జాతి సంపద: నన్నపనేని రాజకుమారి
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు మన జాతి సంపద అని నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆయనను జైలులో నిర్భందించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలు నరకం చూస్తున్నారన్నారు.

Translate this News:











