వచ్చే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. కంగారు జట్టుకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో లాంగర్ ఒకడు. అతడి కోచింగ్‌లో ఆస్ట్రేలియా 2021లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు బిగ్‌బాష్ లీగ్‌లోనూ కోచ్‌గా పెర్త్ స్కార్చర్స్ టీమ్‌కు ట్రోఫీని అందించాడు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్‌ను సలహాదారుగా నియమించుకుంది. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్‌గా పనిచేయడంతో పాటు గతంలో ఇండియా జట్టుకు ఆడిన అనుభవం కూడా పనికొస్తుందని లక్నో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి తమ జట్టుకు (స్ట్రాటజిక్ కన్సల్టెంట్ వ్యూహాత్మక అంశాల సలహాదారుడిగా ఎమ్మెస్కే సేవలు అందిస్తాడని ఓ ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..లక్నో జెయింట్స్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా తెలుగు వ్యక్తి
వచ్చే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్‌ను సలహాదారుగా నియమించుకుంది.

Translate this News:











