One Nation-One ID: ఆధార్ కార్డు గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతిఒక్కరికీ ఈ ఆధార్ గుర్తింపు కార్డు ఉండాల్సిందే. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందడం కోసం అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార ఇలా అన్ని రంగాల్లో మన వివరాలు తెలియజేసేందుకు ఆధార్ కార్డు కాపీ సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా ఆధార్‌కార్డును తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు (One Nation, One Student ID Card) ను తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఈ గుర్తింపు నంబర్‌ను ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్-అపార్)గా పిలువనున్నారు.
పూర్తిగా చదవండి..One Nation-One ID: ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు
ఆధార్ కార్డు లేకుండా ఎవరైన భారతీయులు ఉన్నారంటే వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ కూడా తమ అవసరాల కోసం ఆధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఆధార్ తరహాలోనే దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తలు చేస్తోంది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డును తెచ్చే యోచనలో కేంద్ర విద్యాశాఖ ఉంది.

Translate this News:











