దేశరాజధానిని ముంచెత్తుతున్నాయి వరదలు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో హత్నీకుండ్ బ్యారేజీ గేట్లను ఎత్తివేశారు. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో యమునా నదిలో నీటిమట్టం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జలదిగ్భంధంలో ఉన్నాయి. యమునా నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నది పరివాహాకంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.తాజాగా వరద చారిత్రక కట్టడమైన ఎర్రకోటను కూడా తాకింది. ఎర్రకోట చుట్టున్న రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరదతో నిండిపోయాయి.
పూర్తిగా చదవండి..ఎర్రకోటను కూడా వదల్లేదు.. అక్కడికి కూడా నీళ్లదేవుడు వచ్చేశాడు..ఇప్పుడెలా..?
వర్షాలు తగ్గాయి. అయినా కూడా దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీతోపాటు ఎగువన కురిసిన వర్షాలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రమాదస్థాయిని మంచి ప్రవహిస్తోంది. ఈ భారీ వరదల కారణంగా ఢిల్లీతోపాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. తాజాగా ఢిల్లీలో చారిత్రాత్మక కట్టడమైన ఎర్రకోటను తాకియి వరదలు.

Translate this News:












