దేశంలో పండుగ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గణేశ్ నవరాత్రుల ఉత్సవాల సందడే కనిపిస్తోంది. ఈ వేడుకలు ముగిసిన తర్వాత వరుసగా దేవీ నవరాత్రులు, దసరా, దీపావళి తదితర పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రముఖ సంస్థలు వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఆర్టీసీ, ఇతర ట్రావెల్స్ సంస్థలు సైతం పండుగ సీజన్లో ప్రయాణాలు చేసే వారికి ముందస్తు టికెట్ బుకింగ్ పై ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల జాతరను ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ను (Flipkart Big Billion Days Sale) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ లో వివిధ వస్తువులపై ఈ ఏడాదిలోనే అతి తక్కువ ధరలు ఉంటాయని ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. సేల్ లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై (Smartphones) అదిరే ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది.
పూర్తిగా చదవండి..Flipkart Big Billion Days Sale: ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఆఫర్ల జాతర.. డిస్కౌంట్ల వివరాలివే!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో ఏకంగా 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. అయితే.. సేల్స్ తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Translate this News:











