జమ అయిన రైతుబంధు పైసలు, ఆనందంలో రైతన్నలు!!
రాష్ట్రంలో పదకొండో విడుత రైతుబంధు పంపిణీ ప్రారంభమైంది. సోమవారం ఉదయం వరకు రైతుబంధు నిధులతో రైతన్నల మొబైల్స్ మెసేజ్లతో మోగిపోయాయి.ఉదయం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగాణ సర్కార్ రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసి వారి కళ్లల్లో సంతోషాన్ని నింపింది. రైతుబంధు నిధులు తమ ఖాతాల్లో జమ అయినట్లు వచ్చిన మెసేజ్లను చూసి రైతులు మురిసిపోయారు.












