సాధారణంగా చెట్టుపైకి ఎక్కి కిందకి దూకడం, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి దూకడం లాంటివి చేస్తుంటారు. కానీ ఓ నాలుగంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు దూకడాన్ని ఎప్పడైన చూశారా.? అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇంతకి ఎందుకు అతను అలా భవనంపై నుంచి దూకాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ్ అనే ప్రాంతంలో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. అయితే ఆ బిల్డంగ్ నాలుగో అంతస్తులో ‘మడ్ పైప్ కేఫ్’ పేరుతో హుక్కా బర్ అండ్ పబ్ ఉంది. అక్కడ ఉన్న వంటగదిలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం 11.45 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ యువకుడు ఆ నాలుగంతస్తుల బిల్డింగ్పై చిక్కుకుపోయాడు. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారి లేక అంత ఎత్తులో నుంచే కిందకి దూకేశాడు.
పూర్తిగా చదవండి..Watch Video: వామ్మో.. నాలుగంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకేశాడు..
బెంగళూరులోని కోరమంగళ్ ప్రాంతంలో ఉన్న ఓ కమర్షియల్ బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 6 అగ్నిమాపక శకటలు హుటాహుటిన అక్కడకి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న ఒక యువకుడు ఏకంగా నాలుగో అంతస్తు నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిందకు దూకేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలో వైరలవుతోంది.

Translate this News:











