యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు ఖుషి మూవీ( Khushi movie) టీం కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రంలో పంచ కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హీరో దేవరకొండను చూసేందుకు పలువురు అభిమానులు తరలి వచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలను చూస్తూ ఆయన దేవుడి దర్శనానికి వెళ్లారు. ఆలయ కొండపైకి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Yadadri: యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ
ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు (Movie celebrities) కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ ( Film actor Vijay Deverakonda) యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సందడి చేశారు.

Translate this News:











