Fever Syndrome in Children: సడెన్గా మారుతున్న వాతావరణంతో పిల్లలు(Health) జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల(Children) రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా చిన్నపాటి చల్లటి గాలి వీచినా.. వెంటనే పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంటుంది. అయితే, తరచుగా జ్వరం రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ బిడ్డకు పదే పదే జ్వరం వస్తున్నట్లయితే.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకండి. వెంటనే వైద్యులకు చూపించాలి. ఎందుకంటే.. జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు.
పూర్తిగా చదవండి..Fever Syndrome: మీ పిల్లలకు పదే పదే జ్వరం వస్తుందా? ఇదే కారణం కావొచ్చు..!
మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తోందా? జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? పదే పదే పిల్లలకు జ్వరం రావడానికి వైరస్లు, బ్యాక్టీరియా కారణం అవ్వొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. తరచుగా ఫీవర్ వస్తున్నట్లయితే.. దానికి కారణం పీరియాడిక్ ఫీవర్ సిండ్రోమ్ అయి ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. మారిన వాతావరణంలో పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్లయితే.. వెంటనే వైద్యులకు చూయించాలి. వారి సూచనల మేరకు చికిత్స అందించాలి.

Translate this News:











