ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నలు నీటి కష్టాలతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే గత 15 నెల రోజుల నుంచి సక్రమంగా కాలువలకు నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని మందపాకల మూడో నెంబర్ పంట కాలవ కింద దాదాపు 30 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. అవి నీరు లేక పూర్తిగా బీడు భూములుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Farmers: పచ్చని పొలాల మధ్య బైక్ సంచారం.. అసలేం జరిగిందంటే?
నీళ్లు రాక బీడు భూములుగా మారిన తమ పంటపొలాల్లో బైక్ నడిపి నిరసన తెలిపారు రైతులు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Translate this News:











