కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన రైతు గోస బీజేపీ భరోసా సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. వర్షాల వల్ల రైతులు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారన్నారు. రైతులు లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి వ్యవసాయం చేశారన్నారు. వరదలతో వారు వేసిన పంట పూర్తిగా నీటిపాలైందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే రైతుల వద్దకు వెళ్లిన కేసీఆర్ వారిని ఇంతవరకూ ఆదుకోలేదని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
సీఎం కేసీఆర్పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

Translate this News:











