బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి వెళ్తుంటారని, కానీ ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీల గురించి పట్టించుకోరని విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న ఆయన.. విజయం సాధించిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ తెలంగాణలో గ్యారెంటీ కార్డులు ఇస్తే ప్రజలు నమ్ముతారా అన్నారు.
పూర్తిగా చదవండి..Etala Rajender: బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట
బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామని ఈటల తెలిపారు.

Translate this News:











