Special Trains: దసరా సమీపిస్తున్న వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్న్యూస్ చెప్పింది. దసరా పండుగ కోసం అందరు తమ తమ సొంత ఊర్లకు వెళ్తుండడంతో ఇప్పటికే వేసిన ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో 9 రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. రేపు నాందేడ్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈ రైలు (07061) నాందేడ్ లో బయలుదేరి నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ మీదుగా కాకినాడకు చేరుకుంటుంది.
పూర్తిగా చదవండి..ఆ రోజు వరకు ఈ రైళ్లు రద్దు..!!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య రైళ్లు తిరగనున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు, నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Translate this News:











