ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్నారు. నిన్ననే ఆయన వాదనలు వినిపించగా.. సమయం లేకపోవడంతో పూర్తిస్థాయిలో వినలేదు. అందుకని ఇవాళ్టికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో మళ్లీ గురువాయం వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ, టెండర్ అవార్డు కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరన్నారు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ తెలిపారు. విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో.. తప్పులకు, ఆర్థిక అక్రమాలకు, చోటు చేసుకున్న లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయడం సరికాదని అగర్వాల్ అన్నారు. అయితే ఈ కేసులో రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న పిటిషనర్‌ను కారాగారంలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో దురుద్దేశంతో చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించారని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదించారు.
పూర్తిగా చదవండి..CID filed memo: చంద్రబాబు రిమాండ్ పొడిగించండి.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు రెండోసారి విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో ఆయనను హాజరుపరిచారు. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని ఏసీపీ కోర్టులో ఎక్స్టెన్షన్ మెమో దాఖలు చేసింది సీఐడీ. చంద్రబాబును మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని మెమోలో సీఐడీ పేర్కొంది.

Translate this News:











