Dravidians and sanathana dharmics: బ్రాహ్మణుల గుత్తాధిపత్యంపై పోరాటం చేసిన గడ్డ తమిళనాడు(Tamilnadu). దళితుల(Dalits) పక్షన నిలబడి ‘ఆత్మగౌరవ’ ఉద్యమాన్ని ప్రారంభించిన తమిళులు ఈనాటికి సనాతన ధర్మ(Sanathana dharma) సిద్ధాంతాలపై తమ గళం వినిపిస్తూనే ఉన్నాయి. కుల నిర్మూలన జరగాలని.. సనాతన అంటే సంస్కృతంలో ‘శాశ్వతం’ అని అర్థం అని.. ఈ వివిక్ష, అంటరానితనం సనాతన ధర్మం మూలసూత్రాలంటూ బ్రాహ్మణవాదంపై ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. ద్రవిడ(dravida) ఉద్యమాల నుంచి జీవం పోసుకొని పుట్టిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పెరియార్(periyar) అడుగులను ఈనాటికి అనుసరిస్తూనే ఉంది. అందుకు తాజాగా డీఎంకే మంత్రి, తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి(Udhayanidhi) చేసిన వ్యాఖ్యలే బెస్ట్ ఎగ్జాంపూల్. సనాతన ధర్మంతో సామాజిక న్యాయం జరగదని, ఇది మలేరియా, డెంగీ లాంటిదని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అటు రాజకీయ రచ్చతో పాటు హిందూ మతాల పెద్దలు సైతం ఉదయనిధిపై మండిపడుతున్నారు. అసలు ఉదయనిధి ఇలా ఎందుకు వ్యాఖ్యానించారు. తమిళనాడులో కులాల వారీ వ్యవస్థల నిర్మూలనకు కంకణం కుట్టుకున్నామని ఆయన ఎందుకు చెబుతున్నారు? అసలేంటి ద్రవిడ వర్సెస్ సనాతన వైరం?
పూర్తిగా చదవండి..Dravida vs Sanathana: ద్రవిడ, సనాతన మధ్య ఈ వైరం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది?
సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నాయి. మరోవైపు అసలు ఉదయనిధి స్టాలిన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు, కుల వ్యవస్థను ఎందుకు నిర్మూలించాలంటున్నారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వందల ఏళ్ల నాటి ద్రవిడ, బ్రహ్మణవాద వైరం గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు.

Translate this News:













